రన్నింగ్​ బస్సులో రేప్​ కేసు నిందితులు రిమాండ్

రన్నింగ్​ బస్సులో రేప్​ కేసు నిందితులు రిమాండ్

సికింద్రాబాద్ : రన్నింగ్​బస్సులో సోమవారం రాత్రి మహిళపై అత్యాచారానికి పాల్పడిన డ్రైవర్​ను అరెస్ట్​చేసినట్లు ఈస్ట్​జోన్​డీసీపీ బాలస్వామి తెలిపారు. బుధవారం ఓయూ ఏసీపీ ఆఫీసులో నిందితులను మీడియాకు చూపించారు. ఏపీలోని నెల్లూరుకు చెందిన ఈర్ల కృష్ణబాబు(35), ప్రకాశం జిల్లాకు చెందిన రామగిరి సిద్ధయ్య(32) హరికృష్ణ ట్రావెల్స్​లో డ్రైవర్లు. గత సోమవారం సాయంత్రం వీరిద్దరూ స్లీపర్​బస్సులో ప్రయాణికులను ఎక్కించుకుని ప్రకాశం జిల్లాలోని పామూరుకు బయలుదేరారు. ఓ మహిళ(28) తన ఎనిమిదేళ్ల కూతురుతో పొదిలి వెళ్లేందుకు బస్సు ఎక్కింది. టికెట్​చెకింగ్​టైంలో వారిద్దరికీ కలిపి సింగిల్​బెర్త్(బెర్త్–1) ఉన్నట్లు తెలుసుకున్న సిద్ధయ్య, మహిళ వివరాలు తెలుసుకున్నాడు.

తనదీ ప్రకాశం జిల్లానేనని మాటలు కలిపాడు. మార్గమధ్యలో భోజనానికి ఆగిన టైంలో 5, 6 బెర్త్​లు ఖాళీగా ఉన్నాయని, అక్కడికి మారండని కృష్ణ మహిళతో చెప్పాడు. దీంతో మహిళ కూతురుతో కలిసి 5, 6 బెర్త్​లకు షిఫ్ట్​అయింది. తిరిగి బస్సు బయలుదేరగా సిద్ధయ్య డ్రైవింగ్​చేస్తున్నాడు. కృష్ణబాబు 5, 6 బెర్త్​ల వద్దకు వెళ్లి మహిళ నోట్లో బెడ్​షీట్​కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. మెట్టుగూడ వద్ద సిద్ధయ్య బస్సును స్లో చేయగా, కృష్ణబాబు పరారయ్యాడు. బాధితురాలి ఫోన్​కాల్​తో తార్నాకలో బస్సును ఆపి పోలీసులు డ్రైవర్ సిద్ధయ్యను అదుపులోకి తీసుకోగా, పరారైన కృష్ణబాబును బుధవారం అరెస్ట్​చేశారు. ఇద్దరిని రిమాండుకు తరలించినట్లు డీసీపీ బాలస్వామి వెల్లడించారు.