ఫోన్ ట్యాపింగ్ కేసు.. మరోసారి నిందితుల బెయిల్ పిటిషన్లు

హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులు మరోసారి బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో పోలీసులు ఫైల్ చేసిన చార్జ్ షీట్ ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. దీంతో తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితులైన భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై గురువారం వాదనలు జరిగాయి.

కేసు నమోదై 100 రోజులు పూర్తయిందని, లోపాల కారణంగా చార్జ్​షీట్ రిజెక్ట్ అయిందని, ఈ నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని నిందితుల తరఫు లాయర్లు కోర్టును కోరారు. అయితే కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, ఈ టైమ్ లో బెయిల్ మంజూరు చేయవద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.