వరంగల్ మిస్టరీ: ఒక హత్యను తప్పించుకోవడానికి 9 హత్యలు

వరంగల్ జిల్లా గొర్రెకుంటలో జరిగిన 9 మంది వలస కూలీల హత్య కేసులో కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. నిందితుడికి సంబంధించి అనేక విషయాలు బయటపడుతున్నాయి. ఇంతకు ముందు చేసిన ఒక హత్య నుంచి తప్పించుకునేందుకు నిందితుడు 9 మందిని హత్య చేసినట్లు సమాచారం. మక్సూద్ సమీప బంధువుతో నిందితుడు సంజయ్ యాదవ్ సహజీవనం చేసినట్లు తెలుస్తోంది. అయితే సంజయ్.. ఆ మహిళను మార్చిలో నిడదవోలు దగ్గర రైలు నుంచి తోసేసి హత్య చేసినట్లు పోలీసు విచారణలో బయటపడినట్లు సమాచారం. మక్సూద్ కుటుంబం ఆమె గురించి ఆరా తీయటంతోనే సంజయ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

For More News..

విమానాలు షురూ.. ఢిల్లీ నుంచి బెంగుళూరు జర్నీ చేసిన 5 ఏళ్ల చిన్నోడు

విషాహారం తిని కుటుంబం ఆత్మహత్య

64 మందితో 24గంటల సర్జరీ