వక్ఫ్ బోర్డు ట్రస్టీలమంటూ 17 ఏండ్లు చీటింగ్.. అక్రమ నిర్మాణాలు చేపట్టి అద్దె వసూలు చేసిన నిందితులు

వక్ఫ్ బోర్డు ట్రస్టీలమంటూ 17 ఏండ్లు చీటింగ్.. అక్రమ నిర్మాణాలు చేపట్టి అద్దె వసూలు చేసిన నిందితులు

అహ్మదాబాద్: ఐదుగురు వ్యక్తులు వక్ఫ్​బోర్డు ట్రస్టీలుగా నటిస్తూ చేసిన ఘరానా మోసం తాజాగా అహ్మదాబాద్ లో బయటపడింది. 17 ఏండ్ల పాటు కొనసాగిన ఈ కుంభకోణం ఇటీవల వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్ లోని కాంచ్ని మసీదు ట్రస్ట్, షా బడా కసమ్ ట్రస్ట్ వక్ఫ్ బోర్డు కింద నమోదయ్యాయి. ఈ రెండు ట్రస్ట్ ల కింద ఉన్న ఐదు వేల చ.అ.కు పైగా భూమిలో నిందితులు అక్రమ నిర్మాణాలను చేపట్టారు. 2008 నుంచి 2025 మధ్య 100 దుకాణాలు, షాపులను నిర్మించి ప్రతినెలా అద్దె వసూలు చేసుకున్నారు. మహమ్మద్ రఫీక్ అన్సారీ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం బయటపడింది.