![నారాయణపేటలో నగదు కాజేస్తున్న నిందితుడి అరెస్ట్](https://static.v6velugu.com/uploads/2025/02/accused-of-withdrawing-money-from-atm-arrested-in-narayanpet_92SYGOtfPh.jpg)
నారాయణపేట, వెలుగు : ఏటీఎంలో డబ్బులు తీసుకునేందుకు సాయం చేస్తున్నట్లు నటించి నగదు కాజేస్తున్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ శివశంకర్, ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. డిసెంబర్ 26న పట్టణంలోని ఎస్బీఐ ఏటీఎంలో నగదు డ్రా చేయడానికి వచ్చిన సింగారానికి చెందిన పింజర్ కథల్ అనే వ్యక్తి సాయం అడగగా, తిరుపతి జిల్లా చిన్నగట్టికల్లు మండలం రంగన్నగడ్డకు చెందని రియాజ్ ఏటీఎం మార్చి రూ.1.95 కాజేశాడు.
సోమవారం మరొకరి దగ్గర డబ్బులు కాజేసేందుకు ప్రయత్నించగా, నిందితుడిని పట్టుకున్నట్లు తెలిపారు. వ్యాపారంలో నష్టం రావడంతో వాటిని పూడ్చుకునేందుకు ఏటీఎం దగ్గర సాయం చేస్తున్నట్లు నటిస్తూ డబ్బులు కాజేస్తున్నట్లు చెప్పారు. రూ. 98 వేల నగదు, రెండు ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.