అంజన్న ఆలయంలో చోరీ.. ఘటనలో ఏ1 అరెస్ట్​

కొండగట్టు, వెలుగు: గత ఫిబ్రవరిలో కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీ చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు(ఏ1) రామారావు జాదవ్ ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ ప్రకాశ్​ తెలిపారు. గురువారం కొండగట్టు గుట్ట కింది ప్రాంతంలో వెహికల్ చెక్​ చేస్తుండగా రామారావు అనుమానాస్పదంగా కనిపించడంతో అరెస్టు చేసి విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు చెప్పారు. 

ఫిబ్రవరి 23న కొండగట్టు టెంపుల్ చోరీలో  ఏడుగురు పాల్గొనగా అప్పట్లో ముగ్గురిని అరెస్టు చేశారు. తాజాగా ఏ 1 నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు తెలిపారు.