కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార కేసులో నిందితునికి 14 రోజుల జ్యుడిషియల్ కస్డడీ

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార కేసులో నిందితునికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్డడీ విధించింది. శుక్రవారం(ఈరోజు)తో సీబీఐ కస్డడీ ముగియడంతో విచారణకు సంబంధించిన పూర్తి వివరాలతో నిందితుడు సంజయ్ రాయ్ ని సీల్దా కోర్టులో హాజరు పరిచారు. RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ని పోలీసులు అరెస్టు చేశారు. 

ఈ కేసును పోలీసుల దర్యాప్తు నుంచి సీబీఐకు అప్పగించారు. ఆగస్ట్ 23 వరకు సీబీఐ కస్టడీలో ఉన్న నిందితుడిని సీబీఐ విచారించి ఈ రోజు సీల్దా కోర్టు ముందు హాజరుపరిచింది సీబీఐ. తదుపరి విచారణ కోసం అతనికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. సెప్టెంబర్ 14 వరకు సంజయ్ రాయ్ జ్యుడిషియల్ కస్టడీలో ఉండనున్నాడు. అలాగే నిందితుడికి పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు కోర్టు అనుమతి తెలిపింది. మరోవైపు ఆర్జీకర్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కు కూడా.. లై-డిటెక్టర్ పరీక్ష నిర్వహించనుంది సీబీఐ.

ALSO READ | బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారం..అసోంలో ఉద్రిక్తత