సిద్దిపేట : చేర్యాల జెడ్పీటీసీ మల్లేశం హత్య కేసులో నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. చేర్యాల మండలం గుర్జకుంట ఉప సర్పంచ్ నంగి సత్యనారాయణ, నవీన్ అనే వ్యక్తి తామే చంపినట్లు అంగీకరించారు. పాత కక్షల కారణంగానే ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉదయం మార్నింగ్ వాక్ తర్వాత ఇంటికి వెళ్తుండగా మల్లేశంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్రమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దాడి గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు మల్లేశాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మల్లేశం పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట నుండి హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ప్రాణాలు కాపాడేందుకు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్సపొందుతూ మల్లేశం మృతి చెందాడు.