మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక నిందితులుగా ఉన్న కలాహర్ రెడ్డి, హిటాచి సాయి, స్నార్ట్ పబ్ ఓనర్ సూర్యలను మరోసారి నార్కోటిక్ బృందం విచారించనుంది. 2023 అక్టోబర్ 02న ఈ ముగ్గురు నిందితులు గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కానున్నారు. డ్రగ్స్ కేసు నిందితులుగా ఉన్న వీరిని ప్రతీ సోమవారం పోలీసుల విచారణకు హజరు కావలని తెలంగాణ హైకోర్టు సూచించింది.
గత నెల సెప్టెంబర్ 26న గుడిమల్కాపూర్ పోలీసుల ఎదుట ఈ ముగ్గురు నిందితులు లొంగిపోయారు. పోలీస్ స్టేషన్ లోనే వీరిని సుమారుగా 5 గంటల పాటు నార్కోటిక్ డీఎస్పీ నర్సింగ్ రావు విచారించారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన రోజే పోలీస్ స్టేషన్ లో కలహర్ రెడ్డి హంగామా చేశారు. మీడియా అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగాడు.
Also Read :- ఊరేగింపుకొచ్చి ఫోన్లు పోగొట్టుకున్నరు
సినీ ఇండస్ట్రీలో స్క్రిప్ట్, రైటర్, షల్ వి మీట్ .. అనే కోడ్ లాంగ్వేజ్ తో డ్రగ్స్ సప్లై అవుతున్నట్లు నార్కోటిక్ పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. మరికొంత మంది డ్రగ్స్ కన్జ్యూమర్స్ కు నోటీసులు జారీ చేశారు. హీరో నవదీప్ ను ఆరు గంటల పాటు విచారించారు. నవదీప్ 40 మంది డ్రగ్ కన్జూమర్స్ పేర్లను చెప్పినట్లు సమాచారం.