ఇద్దరి మృతికి కారణమైన నిందితుడు అరెస్ట్

ఇద్దరి మృతికి కారణమైన నిందితుడు అరెస్ట్

చెన్నూరు, వెలుగు: మండలంలోని అంగరాజ్ పల్లి గ్రామ శివారులో శనివారంరాత్రి బొలెరో వాహనంతో ఢీకొట్టి ఇద్దరి మృతికి కారణమైన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోట పల్లి మండలంలోని పారుపెల్లి గ్రామానికి చెందిన గడల తిరుపతి మద్యం మత్తులో వాహనం నడిపి ఎదురుగా వస్తున్న రెండు బైక్ లను ఢీకొట్టడంతో కంకనాల దేవేందర్, మహమ్మద్ సైఫ్ అక్కడికక్కడే చనిపోయారు. మృతుడు దేవేందర్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు సీఐ రవీందర్ తెలిపారు.