హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్‌లో కాకరేపుతోన్న ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఐఏఎస్ అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలను విచారించిన ఏసీబీ.. నెక్ట్స్ ఫోకస్ ఈ రేసింగ్ నిర్వహణ కంపెనీలపై పెట్టింది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ రేస్ నిర్వహకులుగా ఉన్న గ్రీన్ కో, ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీల ప్రతినిధులకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది.
ఏసీబీ నోటీసుల మేరకు ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులు శనివారం (జనవరి 18) విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేస్ సీజన్ 9 అనంతరం.. ఉన్నట్టుండి నెక్ట్స్ సీజన్ నిర్వహణ ఒప్పందం నుండి ఏస్ నెక్స్ట్ జెన్ వైదొలగడంతో పాటు పలు కోణాల్లో ఏసీబీ అధికారుల బృందం ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే.. ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ కీలక డాక్యుమెంట్ల ఆధారంగా ఏసీబీ అధికారులు క్వశ్చన్ చేస్తున్నట్లు సమాచారం.