హైదరాబాద్, వెలుగు : బజాజ్ ఎలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏస్ పేరుతో ఫ్లెక్సిబుల్ గ్యారెంటీ ఆదాయ జీవిత బీమా ప్లాన్‌ని ప్రారంభించింది. ఇది నాన్ -లింక్డ్, పార్టిసిపేటింగ్, ఎర్లీ ఇన్కమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అని కంపెనీ తెలిపింది. కస్టమర్ల వారి ఆర్థిక అవసరాల ఆధారంగా వారి క్యాష్‌ఫ్లోలను మార్చుతుంది. కస్టమర్‌లు పాలసీ ప్రారంభం నుండి ఆదాయాన్ని పొందడం ప్రారంభించవచ్చు లేదా దానిని 5 సంవత్సరాల వరకు వాయిదా వేయవచ్చు. వారి ఆర్థిక అవసరాలకు సరిపోయే నిర్దిష్ట తేదీ నుంచి ఆదాయం పొందే సదుపాయం ఉంది.
కస్టమర్‌లు తమ వయస్సులో కనీసం 10 సంవత్సరాల నుంచి పాలసీ కాలాన్ని (టెన్యూర్) ఎంచుకోవడానికి కూడా ప్లాన్ అనుమతిస్తుంది. పాలసీ హోల్డర్లు తమ ఆర్థిక అవసరాలను బట్టి లక్ష్యాలను ఎంచుకోవచ్చు. లైఫ్ కవర్‌తో పాటు, 100 సంవత్సరాల వయస్సు వరకు జీవితకాల ఆదాయాన్ని అందిస్తుంది. పాలసీదారు మరణిస్తే నామినీకి ఆర్థిక భద్రత కల్పిస్తారు. మహిళా పాలసీదారులకు అదనంగా 2శాతం ఆదాయ ప్రయోజనం ఉంటుంది. ప్రీమియం పేమెంట్ టర్మ్ ముగిశాక హామీ మొత్తంతోపాటు బోనస్‌లు వస్తాయి.