ఏసర్​ నుంచి రెండు ట్యాబ్లెట్స్​

ఏసర్​ నుంచి రెండు ట్యాబ్లెట్స్​

ఎలక్ట్రానిక్స్​ కంపెనీ ఏసర్​ రెండు కొత్త టాబ్లెట్స్​ వన్​ 8, వన్ 10లను లాంచ్​ చేసింది. రెండింట్లోనూ మీడియాటెక్​ 8768 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌‌‌‌ ఉంటుంది.  వన్​8లో  8.7-అంగుళాల స్క్రీన్​ఉంటుంది. వన్​ 10లో మాత్రం 10.1-అంగుళాల డిస్​ప్లే ఉంటుంది. రెండూ అండ్రాయిడ్​12 ఓఎస్​తో నడుస్తాయి. వన్​8లో 3జీబీ ర్యామ్​+32 జీబీ స్టోరేజీ ఉంటాయి. వన్​10లో 4జీబీ+64 జీబీ స్టోరేజీ ఉంటాయి.   4జీ సిమ్​, వైఫై,  బ్లూటూత్ 5.0, కెమెరాల వంటి ప్రత్యేకతలు వీటి సొంతం.   వన్​8 ధర రూ.12,990 కాగా, వన్​10 రేటు రూ. 17,990.