కొత్త మందు తయారీకి గ్రాన్యూల్స్‌‌కు ఎఫ్‌‌డీఏ అనుమతి

కొత్త మందు తయారీకి గ్రాన్యూల్స్‌‌కు ఎఫ్‌‌డీఏ అనుమతి
  • కొత్త మందు తయారీకి గ్రాన్యూల్స్‌‌కు ఎఫ్‌‌డీఏ అనుమతి

హైదరాబాద్‌‌, వెలుగు : తన ఫారిన్ సబ్సిడరీ   గ్రాన్యూల్స్‌‌ ఫార్మాస్యూటికల్స్‌‌ ఇంక్‌‌. (జీపీఐ) ఎసిటమైనోఫెన్‌‌, ఇబుప్రోఫెన్‌‌  250 ఎంజీ / 125 ఎంజీ (ఓటీసీ) మాత్రలను తయారు చేయడానికి ఫైల్ చేసిన అబ్రివియేటెడ్‌‌ న్యూడ్రగ్‌‌ అప్లికేషన్‌‌ (ఏఎన్‌‌డీఏ) కు యూఎస్‌‌ ఫుడ్‌‌ అండ్‌‌ డ్రగ్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌ (యూఎస్‌‌ ఎఫ్‌‌డీఏ) నుంచి అనుమతులు వచ్చాయని గ్రాన్యూల్స్‌‌  ప్రకటించింది. ఈ మందులను  గ్లాక్సో స్మిత్‌‌ క్లైన్‌‌ కన్జూమర్‌‌ హెల్త్‌‌కేర్‌‌ హోల్డింగ్స్‌‌ (యూఎస్‌‌) డెవలప్ చేసింది.

ఎసిటమైనోఫెన్‌‌ మాత్రలు అడ్విల్ డ్యూయల్‌‌ యాక్షన్‌‌ 250 ఎంజీ / 125 ఎంజీ (ఓటీసీ)కు బయో ఈక్వవలెంట్‌‌. ఎసిటమైనోఫెన్‌‌, ఇబుప్రోఫెన్‌‌ మాత్రలను తలనొప్పి, పంటి నొప్పులు, వెన్నునొప్పులు, టాయిలెట్‌‌కి వెళ్లేటప్పుడు పొత్తి కడుపు నొప్పి, కండరాల నొప్పులు, మైనర్‌‌ ఆర్థరైటిస్‌‌ కారణంగా వచ్చే చిన్న పాటి బాధలు, నొప్పుల నుంచి  తాత్కాలిక ఉపశమనం కోసం వాడతారు. గ్రాన్సూల్స్ యూఎస్‌‌ఎఫ్‌‌డీఏ నుంచి  మొత్తం 59 ఏఎన్‌‌డిఏ ఆమోదాలు పొందింది.