రోజుకు మూడు సార్లు రంగులు మారే శివలింగం ఎక్కడుందో తెలుసా...

రోజుకు మూడు సార్లు రంగులు మారే శివలింగం ఎక్కడుందో తెలుసా...

శివలింగం రోజు మూడుసార్లు రంగులు మారుస్తుంది.  ఉదయంవేళ ఎర్రగా, మధ్యాహ్నం వేళ కాషాయంలో..  సాయంత్రం వేళ చామర ఛాయగా (నీలం) రంగుల్లోకి మారి.. భక్తులకు దర్శనమిస్తుంది. ఇదే విషయంపై అనేక మంది పరిశోధనలు చేశారు. అయితే ఈ మిస్టరీని ఇప్పటి వరకూ ఏ శాస్త్రవేత్తలు నిరూపించలేకపోయారు..  ఆ దేవాలయం చరిత్ర ఏమిటి.. .ఆ అత్యద్భుత శివలింగం గురించి తెలుసుకుందాం.

 ప్రపంచంలోనే కాదు ఈ అనంత విశ్వంలో ఎన్నో వింతలు, విచిత్రాలు..సైంటిస్టులు కూడా ఛేదించలేని రహస్యాలు..మర్మాలు ఎన్నో..ఎన్నెన్నో.. అటువంటి మర్మాలు సైన్స్‌కి కూడా అందవు. ముఖ్యంగా దేవాలయాలకు సంబంధించిన రహస్యాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగక మానదు. అందులోను శివాలయాల్లో రహస్యాలకు కొదువ లేదు. వాటిలో ఓ శివాలయంలోని శివలింగం రోజుకు మూడు రంగుల్లోకి మారుతుంది...అదే రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలోని ‘అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం’..

భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి.. వీటిల్లో కొన్ని ఆలయాలు రహస్యాలకు నెలవు. ఈ ఆలయాలు శతాబ్దాలుగా ప్రజలను ఆకర్షిస్తూనే ఉన్నాయి. అటువంటి విశిష్ట దేవాలయం రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో కూడా ఉంది. దీని గురించి వింటే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. ఇండియాలో ఉన్న శివాలయాలలో మిస్టరీ ఆలయంగా ఖ్యాతిగాంచింది. సైన్స్ కు సవాల్ కు విసురుతూనే ఉంది.  

ఈ ఆలయంలో ప్రతిష్టించిన శివలింగం రోజుకు మూడు సార్లు దాని రంగును మార్చుకుంటుంది. చంబల్ నది ఒడ్డున ఉన్న ఈ శివాలయాన్ని ‘అచలేశ్వర్ మహాదేవ్’ దేవాలయం అని పిలుస్తారు. ఈ ఆలయం దుర్భరమైన భూభాగంలో ఉన్నందున, ఇంతకుముందు చాలా తక్కువ మంది మాత్రమే ఇక్కడికి వచ్చేవారు.. క్రమంగా ఆలయంలోని మిస్టరీ వెలుగులోకి వచ్చిన తర్వాత..  భక్తులు సంఖ్య పెరిగింది. ముఖ్యంగా  శివరాత్రి పర్వదినాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. రంగురంగులు మారుస్తున్న  శివలింగం గురించి  అనేక రకాల కథలు వాడుకలో ఉన్నాయి. ప్రతి రోజు మూడు సార్లు రంగులు మార్చే ఆ శివలింగ మహత్యం ఏమిటో తెలుసుకోవటానికి రాజస్థాన్ వెళ్లాల్సిందే


మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పరమశివుడి ఎన్నోదేవాలయాలు ఉన్నాయి. అటువంటి శివాలయాల్లో ‘అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం’ ఆలయంలోని శివలింగం రోజుకు మూడుసార్లు రంగులు మారుతుంది. ఉదయం వేళ ఒకలా… మధ్యాహ్నం మరోలా… రాత్రి ఇంకో రంగులో మారి కనువిందు చేస్తుంది. ఈ శివలింగం ఎలా వచ్చిందో, ఎప్పుడు ఆవిర్భవించిందో ఎవరికీ తెలియదు. అంటే ఆ శివయ్య స్వయంభువుగా వెలసినట్లు చెబుతుంటారు.ఉదయం వేళ సూర్యుడు ఉదయించాక… శివలింగం ఎరుపు రంగులోకి మారుతుంది. మధ్యాహ్నం కాగానే… కాషాయరంగులోకి మారిపోతుంది. రాత్రివేళ నలుపు రంగులోకి మారిపోయే ఈ దేశాలయం 2,500 ఏళ్ల నాటిదని స్థానికులతో పాటు చరిత్రకారులు చెబుతున్నారు.

ఈ శివలింగం ఎంతో మహిమాన్వితమైనదని…కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా అచలేశ్వరుడు పూజలందుకుంటున్నారు. ఈ ఆలయంలో కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతుంటారు. ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడే ఈ దేవాలయం మహా శివరాత్రి పర్వదినాన భారీ సంఖ్యలో వచ్చే భక్తులతో కళకళలాడిపోతుంటుంది.

అంచలేశ్వర లింగం రంగులు ఎందుకు మారుతోంది? అనే మర్మంపై ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. కానీ ఎటువంటి ఆధారాలు తెలియలేదు. హేతు వాదులు కూడా రంగులు మారే సీక్రెట్ ఏంటో తేల్చేస్తామని ఎన్నో రకాలుగా యత్నాలు చేశారు గానీ ఏమీ తేల్చలేకపోయారు. దీంతో అచలేశ్వరుడి మహత్యం మిస్టరీగా మిగిలిపోయింది.ఈ ఆలయం అందం చూడటానికి రెండు కళ్లూ చాలవు. రాజస్థాని పాలరాళ్లతో అత్యంత అద్భుతంగా నిర్మించారు. 

ఈ ఆలయం లోపల సగం గుడ్రంగా ఉన్న ఓ చిన్న గొయ్యి ఉంటుంది. అది శివుడి బొటనవేలు అని చెబుతుంటారు. ఎవరైనా ఆ కన్నంలో నీరు పోస్తే… ఆ నీరు మాయమవుతుంది..అలా దాంట్లో పోసిన నీళ్లు ఎక్కడికి పోతాయో కూడా ఎవ్వరికీ అంతుపట్టటం లేదు. ఈ ప్రాచీన ఆలయంలో మరో ఆకర్షణ శివయ్యకు అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పాల చెట్లు చంప పుష్పాల చెట్టు ఉంటుంది. 

ఆలయ విశిష్టత:

ఈ అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం సుమారు 2500 సంవత్సరాల క్రితం నాటిదని స్థానికులు చెబుతారు. ఈ ఆలయంలో మరో ప్రధాన ఆకర్షణ నంది విగ్రహం. పంచ లోహాలతో తయారుచేశారు. ఇక్కడి పురాణ కధనం మేరకు.. ఈ ఆలయం మీద కొందరు దండెత్తినప్పుడు  తేనెటీగలు దాడి చేశాయట. అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఎంత పురాతనమైనది. ఈ శివలింగం ఎప్పుడు స్థాపించబడిందో తెలియదు. అయితే శివలింగం భూమిలో ఎంత లోతుగా ఉందో తెలుసుకోవడానికి ఒకసారి తవ్వకం కూడా చేపట్టారు. ఎన్ని రోజులు ఎంత తవ్వినా శివ లింగం ముగింపు దగ్గరకు చేరుకోలేదు. దీంతో తవ్వే పనిని నిలిపివేశారు. ఈ శివలింగం లోతును అంచనా వేయడం కోసం  శివలింగం స్వయం భూ కదా ? మరి అది ఎంత లోతు ఉందొ చూడాలని గతంలో రాజులు, చక్రవర్తులు లింగం చుట్టూ తవ్వడం ప్రారంభించారు. శివలింగం లోతు తవ్వేకొద్దీ లోతు ఎక్కువగా కనిపిస్తుండటం తో వారు ఆ పనిని నిష్క్రమించారు.

మహిమ కలిగిన ఆలయం: 

అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలోని శివలింగం ఎంతో మహిమలు కలది. జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా ఈ స్వామివారిని  సందర్శించడం ద్వారా సమస్య నుండి బయటపడతారు. ఇది మాత్రమే కాదు.. ముఖ్యంగా పెళ్లికాని వారు ఇక్కడ పూజలు వారికి వెంటనే భాగస్వామి దొరుకుతుందట. పెళ్లికాని వారు 16 సోమవారాలు శివుడికి నీరు సమర్పిస్తే.. శివుడి అనుగ్రహంతో పెళ్ళికి ఏర్పడిన అడ్డంకులన్నీ తొలగిపోతాయట.

ఎలా చేరుకోవాలంటే.. 

రాజస్థాన్ లోని అన్ని ప్రధాన పట్టణాలనుండి ధోల్పూర్ కు బస్సులు ఉన్నాయి. ధోల్పూర్ రైల్వే జుంక్షన్ మీదుగా దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి రైళ్లు వెళుతుంటాయి.