- ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
వంగూరు, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తోందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. సోమవారం చారకొండ మండల కేంద్రంలోని కేజీబీవీలో రూ.3.25 కోట్లతో అదనపు గదుల నిర్మాణానికి మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీ సింగ్, డీఈవో గోవిందరాజు తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యం సంక్షేమంపై బడ్జెట్లో అధిక నిధులుకేటాయిస్తూ విద్యారంగాన్ని బలోపేతం చేస్తోందన్నారు.
పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నిచర్, కాంపౌండ్ వాల్ తదితర సమస్యలపై ఎస్వో మంజుల మ్మెల్యే దృష్టికి తెసుకెళ్లాగా త్వరలోనే పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ గురువయ్య గౌడ్, మాజీ జడ్పీటీసీ వెంకట్ గౌడ్, తహసీల్దార్ సునీత, ఎంపీడీవో ఇస్సాక్ హుస్సేన్, ఎంపీవో వెంకటయ్య, మండల అధ్యక్షుడు బలరాం గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటయ్య యాదవ్, శోభారాణి, ఝాన్సీ రాణి, భగవత్ రెడ్డి,నాయిని జైపాల్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి కృషి
లింగాల : గ్రామాల్లో, పట్టణాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. లింగాల మండల పరిధిలోని శ్రీరంగాపురం, కేసీ తండాలో గ్రామపంచాయతీ కొత్త భవనాల నిర్మాణానికి శంకుస్థాపన, ఎర్ర పెంటలో రూ.60 లక్షలతో నిర్మించిన మల్టీపర్పస్ సెంటర్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఎర్రపెంటలో చెంచు గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అటవీ ప్రాంతంలోని చెరువుల్లో చేపలు పట్టే చెంచు గిరిజనులకు అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఐటీడీఏ నుంచి వచ్చిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.