- ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
వంగూరు, వెలుగు: కేఎల్ఐ, ఆయకట్టు ద్వారా రైతుల పంట పొలాలకు సాగు నీరు అందించాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. మంగళవారం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వంగూరు మండలంలోని10 గ్రామాలకు, కేఎల్ఐ, కాల్వ ద్వారా నూతనంగా ఆయకట్టు నిర్మించి రైతుల పంట పొలాలకు సాగునీరు అందించే విధంగా ఇరిగేషన్ శాఖ, అధికారులు వెంటనే పనులు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆదేశించారు. ఇరిగేషన్ అధికారులు, గ్రామాలకు వెళ్లి పనులు వెంటనే పూర్తిచేయాలని అన్నారు.
వంగూరు మండలంలోని ప్రతి గ్రామానికి ఖరీఫ్ సీజన్ లోసాగునీరు ఇచ్చి రైతులను ఆదుకోవాలన్నారు. ఆ దిశగా అధికారులు పనులు చేయడంలో ప్రత్యేక చొరవ చూపాలన్నారు. సీఎం స్వగ్రామంతో పాటు మండల కేంద్రంలోని సమీకృత భవనాలు మంజూరైనట్లు తెలిపారు. వంగూరు మండలాన్ని నియోజకవర్గంలోని రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు చొరవ తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మండల ప్రచార కమిటీ చైర్మన్ పాండు రంగారెడ్డి, పరశురాములు, శంకర్ యాదవ్, రాజశేఖర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుమలయ్య, జైపాల్ తదితరులు పాల్గొన్నారు.