లింగాల, వెలుగు: అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. శనివారం లింగాల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ 500 కే గ్యాస్ సిలిండర్ ప్రొసీడింగ్స్ ను మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ 500 కె గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
ప్రజా పాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల్లో అర్హులను గుర్తించేందుకు ప్రత్యేకంగా సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇంటి నమూనాను ప్రజలకు అర్థమయ్యేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు రంగినేని శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు, మహిళా అధ్యక్షురాలు ఇందిరమ్మ, పట్టణ అధ్యక్షులు పూజారి వెంకటయ్య, పట్టణ మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, ఉమామహేశ్వర దేవస్థాన డైరెక్టర్ జనార్దన్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు చెంచటి శివ, సీనియర్ నాయకులు రాజు నాయక్, ఉల్లంగొండ రాజు, ఎంపీడీవో ఆంజనేయులు, ఏపీఎం బాలస్వామి, మహిళలు, అధికారులు తదితరులు ఉన్నారు.
అచ్చంపేట, వెలుగు: బల్మూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య కేంద్రం ఆవరణలో శనివారం 108 నూతన వాహనాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ , డిప్యూటీ డీఎంహెచ్ ఓ డాక్టర్ తారా సింగ్ ప్రారంభించారు. అచ్చంపేట పట్టణంలో యాదవ మహాసభ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. బల్మూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్ రెడ్డి వెంకట్ రెడ్డి, నేతలు శ్రీనివాసులు, ఖదీర్ , ఫాజిల్, అల్వాల్ రెడ్డి, శ్రీపతిరావు, సుధాకర్ గౌడ్, రాంప్రసాద్ గౌడ్ పాల్గొన్నారు.