గ్రామీణ ప్రాంత అభివృద్ధే లక్ష్యం

వంగూర్, వెలుగు: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. శనివారం మండలంలోని సర్వారెడ్డిపల్లి గేట్​ నుంచి వంగూర్​ వరకు రూ.43 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు రాష్ట్ర వ్యవసాయ కమిషన్  సభ్యుడు కేవీఎన్ రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. నియోజకవర్గ యూత్  కాంగ్రెస్  అధ్యక్షుడు క్యామ మల్లయ్య ఈ పోటీల్లో ఫస్ట్  ప్రైజ్  రూ.20 వేలు, సెకండ్  ప్రైజ్  రూ.10 వేలు అందజేస్తారని తెలిపారు. యువత మంచి మార్గంలో వెళ్లేందుకు క్రీడలు ఉపయోగపడతాయని చెప్పారు. 

రాజకీయాలకు అతీతంగా యువకులు గ్రామాల అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని సూచించారు. కల్వకుర్తి మార్కెట్  వైస్  చైర్మన్  దేశినేని పండిత్ రావు, మంద పాండురంగారెడ్డి, ఆర్అండ్ బీ డీఈ చంద్రకళ, క్యామ మల్లయ్య, నాయిని జైపాల్, రమేశ్​గౌడ్, వేమారెడ్డి, నరేందర్ గౌడ్, జనార్ధన్, గఫూర్, వెంకటయ్య యాదవ్, జంగయ్య, తిరుమలయ్య, విష్ణు, రాజేందర్ రెడ్డి,శశి పాల్ రెడ్డి పాల్గొన్నారు.