అచ్చంపేట, వెలుగు: నల్లమల ప్రాంతాన్ని పర్యాటకపరంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడుతూ నల్లమలను పర్యాటకప్రాంతంగా మార్చేందుకు ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.
నల్లమలను పర్యాటకప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అన్ని సౌలతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గోపాల్ రెడ్డి, కట్టా అనంతరెడ్డి, రామనాథం పాల్గొన్నారు.
అంగన్వాడీ సెంటర్లకు భూమిపూజ
లింగాల: లింగాలతో పాటు సురాపురం గ్రామంలో అంగన్వాడీ సెంటర్, కేజీబీవీలో ఇంకుడు గుంత నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే వంశీకృష్ణ భూమిపూజ చేశారు. అంతకుముందు మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్లెల్లో మౌలిక వసతులు కల్పించి గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. రంగినేని శ్రీనివాసరావు, కొయ్యల శ్రీనివాసులు, నాగేశ్వరరావు, పూజారి బుడ్డయ్య, విజయలక్ష్మి, కుల్లంగొండ రాజు, ఎంపీడీవో ఆంజనేయులు, ఎంపీవో చంద్రశేఖర్, ఏపీవో ఇమామ్ అలీ ఉన్నారు.