అచ్చంపేట టు హైదరాబాద్​..  రేవంత్​ పాదయాత్ర

  • పాదయాత్రగా మారిన రాజీవ్​ రైతు దీక్ష
  • వడ్లు కొనని కేసీఆర్​కు సీఎం పదవి ఎందుకు ?
  • రాజీవ్‌ రైతు దీక్షలో పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి
  • కాంగ్రెస్​ కార్యకర్తలపై టీఆర్​ఎస్​ జులుం సహించబోమన్న ఎంపీ
  • అచ్చంపేట నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర

నాగర్ కర్నూలు, వెలుగు: పంట కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామని చెప్పిన కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి ఎందుకని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అగ్రి చట్టాలకు కేసీఆర్‌ సపోర్ట్‌ ఉందని అన్నారు. వాటిని రద్దు చేసేదాకా కాంగ్రెస్‌ పార్టీ వెనుకడుగు వేయదని స్పష్టం చేశారు. ఆదివారం  అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా నాగర్​కర్నూల్ జిల్లా అచ్చంపేటలో రేవంత్‌ నేతృత్వంలో రాజీవ్ రైతు దీక్ష జరిగింది. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. దేశానికి పట్టెడన్నం పెట్టేది రైతేనని ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలని అన్నారు.  పంటలకు మద్దతు ధర కల్పిస్తూ కాంగ్రెస్‌ చట్టాలు చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు దళారులు ధర నిర్ణయిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల మీద టీఆర్ఎస్ జులుం చేస్తే సహించేది లేదని చెప్పారు. పోలీసులు తమ క్యాడర్‌ జోలికొస్తే మిత్తితో సహా చెల్లిస్తామని రేవంత్ అన్నారు.

రేవంత్​ను పీసీసీ చేయండని కోరినం: మల్లు రవి

రాష్ట్రం ఏర్పడితే యువత ఆశలు, ఆకాంక్షలు నెరవేరతాయని ఆశించామని, కాని కేసీఆర్ కుటుంబం ఆకాంక్షలే నెరవేతున్నాయని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా చేయాలని పార్టీ హైకమాండ్‌కు బహిరంగంగా చెప్పామని మాజీ ఎంపీ మల్లు రవి చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నడిపించే శక్తి రేవంత్‌కే ఉందన్నారు. టీఆర్ఎస్ కండువా వేసుకున్నోళ్లకే అచ్చంపేటలో కళ్యాణలక్ష్మి ఇస్తున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలు అప్లై చేసుకుంటే ఎమ్మెల్యే సంతకం పెట్టట్లేదని డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ ఆరోపించారు. అచ్చంపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిధులెక్కడ పోయాయని, దీనిపై ఎమ్మెల్యే బాలరాజు అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు రావాలని డిమాండ్ చేశారు.

పాదయాత్రగా మారిన దీక్ష

అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేయాలని రేవంత్‌రెడ్డిని సీతక్క, మల్లు రవి కోరారు. సభకు హాజరైన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, పబ్లిక్ కూడా పాదయాత్ర చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనికి అంగీకరించిన రేవంత్.. రాజీవ్ రైతు భరోసా దీక్షను రైతు భరోసా పాదయాత్రగా మార్చారు. అచ్చంపేట నుంచి నేతలు, అనుచరులతో కలిసి హైదరాబాద్‌కు పాదయాత్రగా బయలు దేరారు. ఉప్పనుంతల మండల కేంద్రానికి చేరేసరికి చీకటి పడటంతో అక్కడే బసచేశారు.

ఇవి కూడా చదవండి..

మేం అధికారంలోకి వస్తే కేసీఆర్ జైలుకే

మూడు నెలల సదువులకు ఏడాది ఫీజు కట్టాల్నట

గవర్నర్ లెటర్​తో సర్కారులో కదలిక

లైన్ దాటి మాట్లాడితే కర్రు కాల్చి వాత పెడ్త.. వినకపోతే కాళ్లు పట్టుకొని బండకు కొడతా

కేసీఆర్​ వార్నింగ్​ వెనుక మతలబేంది..? ఆరా తీస్తున్న కేడర్