మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన ఆచార్య మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత చిరు కొడుకు చెర్రీతో కలిసి తెరపై కనిపించనుండటంతో మెగా అభిమానాల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వరల్డ్ వైడ్గా విడుదల కానున్న ఆచార్య సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
చిరు చివరగా నటించిన సైరా మూవీ రిలీజై దాదాపు రెండున్నర ఏళ్లైంది. కరోనా కారణంగా షూటింగ్లు సాగకపోవడంతో మెగాస్టార్ నటించిన ఆచార్య విడుదల వాయిదాపడుతూ వస్తోంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమా కావడం, రాం చరణ్ కీ రోల్ ప్లే చేయనుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1800 థియేటర్లలో రిలీజ్ కానున్న ఆచార్య ఇప్పటికే రూ.140 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసుకుంది. కరోనా కారణంగా మూవీ బడ్జెట్ రూ.100 కోట్లకుపైగా అయింది.
దుర్మార్గుల నుంచి ధర్మస్థలి అనే దేవాలయాన్ని పరిరక్షంచేందుకు ఇద్దరు నక్సలైట్లు చేసిన యుద్ధం కథాంశంగా ఆచార్య రూపుదిద్దుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ మెగా అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాం చరణ్ సిద్ద అనే రోల్లో కనిపించనుండగా, చెర్రీ సరసన పూజా హెగ్జే నీలాంబరి పాత్రలో అలరించనుంది. సోనూసూద్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. భరత్ అనే నేను చిత్రం తర్వాత కొరటాల చేస్తున్న మూవీ కావడంతో ప్రేక్షకుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.
రాజకీయాలకు గుడ్ బై చెప్పి మళ్లీ సినిమాల్లోకి వచ్చిన చిరు.. సెకండ్ ఇన్నింగ్స్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్లు చిరు స్టామినాకు తగ్గట్టుగా సినిమాలను తీయడం లేదా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చిరు సినిమా రిలీజ్ అయ్యిందంటే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమన్నది సినీ ప్రముఖులు, అభిమానుల అబిప్రాయం. కానీ రీ ఎంట్రీ తర్వాత చిరు నటించిన ఖైదీ నెంబర్ 150, సైరా సినిమాలు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయాయి. ఈ క్రమంలో రెండున్నరేళ్ల తర్వాత కొడుకుతో కలిసి మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్న చిరంజీవి ఆచార్యతో సినిమాతోనైనా మెప్పిస్తారో లేదో వేచి చూడాల్సిందే.
మరిన్ని వార్తల కోసం
చిరుమర్తి నర్సింహకు నివాళులర్పించిన కేసీఆర్