మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య టీజర్ వచ్చేసింది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తం నిర్మాణంలో.. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం సాయంత్రం 4గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేసింది సినిమా యూనిట్. టీజర్ లో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ‘ఇతరుల కోసం జీవించేవారు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పని లేదు’ అని చెర్రీ వాయిస్ ఓవర్ ఇస్తుండగా మెగాస్టార్ ఎంట్రీ ఇచ్చారు.
”పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా, అందరూ ఎందుకో ఆచార్య అని అంటుంటారు, బహుశా గుణపాఠాలు చెబుతాననేమో” అనే చిరంజీవి పవర్ ఫుల్ డైలాగ్ తో టీజర్ ముగిసింది. పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తున్న మెగాస్టార్.. ఆచార్య టీజర్ తో అభిమానులకు జోష్ తీసుకొచ్చాడు. రాంచరణ్ కీలక రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
Presenting #ACHARYA … మీకోసంhttps://t.co/IgjZ6llDL2@sivakoratala @MatineeEnt @KonidelaPro @AlwaysRamCharan
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 29, 2021