
కొండపాక (కుకునూరు పల్లి )వెలుగు: కొత్తగా నిర్మించే వెంచర్లను టార్గెట్ చేసి అల్యూమినియం వైర్లను చోరీ చేస్తున్న దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ బాలాజీ తెలిపారు. మంగళవారం కుకునూరుపల్లి పీఎస్లో మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లాకు చెందిన గంగులోతు చంద్రశేఖర్, కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీనివాస్, జలంధర్ ఒక ముఠాగా ఏర్పడి కొత్తగా నిర్మిస్తున్న ఇండ్లలో అల్యూమినియంవైర్లను చోరీ చేస్తున్నారు.
వీటిని ప్రజ్ఞాపూర్, సిద్దిపేటలోని పలు స్క్రాప్ దుకాణాలలో అమ్ముతూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. వెలికట్ట చౌరస్తా వద్ద పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారు. విచారించగా చోరీలు చేసింది తామేనని ఒప్పుకున్నారని చెప్పారు.