బోధన్, వెలుగు: విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను బోధన్ ఏసీపీ కిరణ్కుమార్మంగళవారం ఆవిష్కరించారు. స్థానిక ఏసీపీ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సంఘం ఆధ్వర్యంలో టాలెంటెడ్, పేద స్టూడెంట్లకు ఆర్థిక సాయం, సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం అన్నారు.
కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవాపురం గోపాలకృష్ణాచార్య, డివిజన్ అధ్యక్షుడు పరమేశ్వర్, గౌరవాధ్యక్షుడు మురారి, కోశాధికారి వేణు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిరణ్ కుమార్, లక్ష్మణాచారి, రాహుల్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.