చెన్నూరు, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెన్నూరు ఏసీపీ వెంకటేశ్వర్లు సూచించారు. బుధవారం చెన్నూరు పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ నుంచి గాంధీ చౌక్ రాజీవ్ రోడ్డు నుంచి అంబేద్కర్ చౌక్ మీదుగా టీఎస్ఎస్ పీ, సీఆర్పీఎఫ్, బలగాలతో కవాతు నిర్వహించారు. ఏసీపీ మాట్లాడుతూ.
అసాంఘిక శక్తులకు ఎలాంటి తావు ఇవ్వకుండా ఓటర్లు నిర్భయంగా ఓటువేసి నచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. చెన్నూరు టౌన్ సీఐ రవీందర్, కోటపల్లి సీఐ సుధాకర్, ఎస్ ఐలు, పోలీస్ సిబ్బంది పాలొన్నారు.
అసాంఘిక శక్తులకు సహకరించొద్దు
తిర్యాణి : అసాంఘిక శక్తులకు సహకరించొద్దని రెబ్బెన సీఐ చిట్టిబాబు 11సూచించారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా బుధవారం మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో సీఆర్పీఎఫ్ బలగాలతో వీధుల్లో కవాతు నిర్వహించారు. ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో ఎవరైనా అసాఘింక కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు.