శ్రీరాంపూర్‌‌లో డ్రోన్ కెమెరాలతో పెట్రోలింగ్ : ఏసీపీ వెంకటేశ్వర్లు

శ్రీరాంపూర్‌‌లో డ్రోన్ కెమెరాలతో పెట్రోలింగ్ : ఏసీపీ వెంకటేశ్వర్లు

నస్పూర్, వెలుగు: అసాంఘిక కార్యకలాపాల కట్టడికి డ్రోన్ కెమెరాలతో ప్రెట్రోలింగ్ నిర్వహిస్తామని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్ అన్నారు. క్రైమ్ హాట్​స్పాట్లను శనివారం వీడియో ద్వారా పర్యవేక్షించారు. శ్రీరాంపూర్ ఏరియాలోని కొత్త రోడ్డు సమీపంలోని ఓపెన్ ఏరియాలో అసాంఘిక కార్యకలపాలకు పాల్పడే, గంజాయి, మద్యం తాగే హాట్​స్పాట్ ఏరియాలను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నామన్నారు. 

శ్రీరాంపూర్ ఏరియాలోని కొత్త రోడ్ సమీపంలో ఎన్ హెచ్ రహదారిపై, పోచమ్మ టెంపుల్ వద్ద పర్యవేక్షించారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎస్సై సంతోష్ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.