
నందిపేట, వెలుగు: రాబోయే ఎన్నికలు, పండుగల్లో ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా శాంతిభధ్రతలు కాపాడేందుకు ప్రజలు సహకరించాలని ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి కోరారు. గురువారం నందిపేటలో వివేకానందా చౌరస్తా నుంచి గ్రామ పంచాయతీ ఆఫీస్ వరకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో కలిసి ఫ్లాగ్ మార్చ్నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ భౌగోళిక పరిస్థితులు, శాంతిభధ్రతలు, గతంలో జరిగిన కమ్యూనల్ గొడవలను దృష్టిలో ఉంచుకొని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆర్ఏఎఫ్ బలగాలతో మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు. ఆర్ఏఎఫ్ 99 బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్వీరేంద్ర యాదవ్, నందిపేట ఎస్సై చిరంజీవి, గ్రామస్తులు పాల్గొన్నారు.