సిద్దిపేట రూరల్, వెలుగు: బాల, బాలికలతో భిక్షాటన చేయించేవారు, పనిలో పెట్టుకునే వారిపై క్రిమినల్కేసులు నమోదు చేయాలని సీసీఎస్ఏసీపీ యాదగిరి సూచించారు. మంగళవారం ఆపరేషన్ స్మైల్ నిర్వహణపై కేర్ టేకర్స్, పోలీస్ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు బాలకార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించడం లేదా, రిహాబిలిటేషన్ సెంటర్ కు పంపించాలన్నారు.
బాల కార్మికులను గుర్తించేందుకు ప్రతి డివిజన్ పరిధిలో ఒక ఎస్ఐ, నలుగురు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. బాల కార్మికులతో పని చేయిస్తున్నట్లయితే డయల్ 100, లేదా సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. సమావేశంలో ఇన్స్పెక్టర్లుమల్లేశ్ గౌడ్, రామకృష్ణ, దుర్గ, ఎస్ఐలు శ్రీనివాస్, ఇస్మాయిల్, అభిలాష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.