దారుణం..తాగి గొడవ చేస్తు్న్నాడని కంప్లైంట్ చేస్తే..మహిళ ఒంటిపై టిన్నర్ పోసి నిప్పంటించిన తాగుబోతు

దారుణం..తాగి గొడవ చేస్తు్న్నాడని కంప్లైంట్ చేస్తే..మహిళ ఒంటిపై టిన్నర్ పోసి నిప్పంటించిన తాగుబోతు

ఒకే ఇంట్లో కిరాయికి ఉండే రెండు కుటుంబాల గొడవ ఒకరి ప్రాణం తీసింది. రోజూ తాగొచ్చి న్యూసెన్స్ చేస్తున్నాడని ఇంటి ఓనర్కు కంప్లైంట్ చేస్తే కక్ష పెంచుకున్న ఓ తాగుబోతు ప్లాన్ ప్రకారం దారుణానికి ఒడిగట్టాడు. పక్కింటి మహిళపై ఓ వ్యక్తి పెయింట్ టిన్నర్ పోసి నిప్పంచిన ఘటన కేరళలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే. 

కేరళలోని కాసర్గోడ్ జిల్లాలోని మన్నడుక్కంలో రమిత ఓ కిరాణా దుకాణం నడుపుతోంది.రమిత దుకాణం పక్కనే తమిళనాడుకు చెందిన రామామృతం అనే వ్యక్తి ఫర్నిచర్ దుకాణం నడుపుతున్నాడు. బాధితురాలు రమిత కొన్ని రోజుల క్రితం నిందితుడు రామామృతం మద్యం మత్తులో తనకు ఇబ్బంది కలిగించాడని అతను కిరాయికి ఉంటున్న ఇంటి యజమానికి ఫిర్యాదు చేసింది.ఆమె ఫిర్యాదు మేరకు ఇంటి యజమాని రామమృతంను ఖాళీ చేయమని వార్నింగ్ ఇచ్చాడు. 

దీనితో ఆగ్రహించిన నిందితుడు రామామృతం..రమితపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ప్లాన్ ప్రకారం రమితపై కలర్లలో కలిపే టిన్నర్ పోసి నిప్పంటించాడని స్థానిక పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటన ఏప్రిల్ 8న జరిగింది. 

►ALSO READ | సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్: మ్యాచ్ అవ్వని ఫింగర్ ప్రింట్స్.. వాట్ నెక్స్ట్

తీవ్రగాయాలపాలైన రమితను స్థానికులు మంగళూరులోని ఆస్పత్రికి తరలించారు. 50శాతం గాలిన గాయాలతో రమిత మంగళవారం ప్రాణాలు కోల్పోయింది.  నిందితుడు రామామృతం పారిపోయేందుకు ప్రయత్నించడగా స్థానికులు పట్టుకొని పోలీసులు అప్పగించారు. 

రామమృతంపై బెడకం పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 109(1) కింద హత్యాయత్నం కింద,దహనం చేసినందుకు సెక్షన్ 326(g) కింద కేసు నమోదు చేశారు.