తెలంగాణకు చెందిన సీనియర్ నేత, నటుడు బాబుమోహన్ కేఏపాల్ కు షాక్ ఇచ్చారు. టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా ఆంథోల్ నియోజకవర్గంలో మెంబర్ షిప్ తీసుకున్న ఫోటోను ఆయన రిలీజ్ చేశారు.
పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి ప్రజాశాంతి పార్టీలో చేరిన ఆయన మళ్లీ కొన్ని రోజుల గడవక ముందే ప్రజాశాంతి పార్టీకి దూరంగా ఉన్నారు . 2024 ఆగస్టులో టీడీపీ అధినేత చంద్రబాబును బాబు మోహన్ కలిశారు. లేటెస్ట్ గా పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు ప్రకటించారు.
ALSO READ : జగన్ బెయిల్ రద్దుకు షర్మిల కుట్ర
బాబు మోహన్ 1999లో ఉమ్మడి మెదక్ జిల్లా ఆందోళ్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. మళ్లీ 2004, 2014లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహపై గెలిచారు. 2018లో బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరి.. బీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతికిరణ్ చేతిలో ఓడిపోయారు. 2023లో బీజేపీ నుంచి పోటీ చేసి దామోదర రాజనర్సింహ చేతిలో ఓడిపోయారు.
లోక్ సభ ఎన్నికలకు ముందు 2024 ఫిబ్రవరి 7న బాబు మోహన్ బీజేపీకి రాజీనామా చేశారు. కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసి పార్టీకి గుడ్ బై చెప్పారు. మార్చి 4న ప్రజాశాంతి పార్టీలో చేరారు. మళ్లీ లేటెస్ట్ గా టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు.