అవసరం లేని టెస్టులు, సర్జరీలు చేస్తే వైద్యులపై చర్య

  • మెడికల్ కౌన్సిల్కు రిఫర్ చేయడానికి వెనుకాడం
  • నార్మల్ డెలివరీలకు ఇంటెన్సివ్ ప్లాన్ 
  • రాష్ట్రంలో 39 శాతం మాత్రమే గోల్డెన్ అవర్లో తల్లి పాలు అందుతున్నాయి
  • వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు

హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం పై స్పెషల్ ఫోకస్ పెట్టామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. జంట నగరాల్లోని పలు ఆసుపత్రుల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ లో రూ.2 కోట్ల 15లక్షల ఖర్చుతో సిటీ స్కాన్ ను ప్రారంభించారు. అలాగే  కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కాంప్లెక్స్ కి శంకుస్థాపన చేసి.. సిటీ స్కాన్ సదుపాయాన్ని ప్రారంభించారు.  సుల్తాన్ బజార్ మెటర్నిటీ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ లో సర్జికల్ ఎక్విప్మెంట్ ప్రారంభించారు. 
కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కోఠి మెటర్నిటీ హాస్పిటల్ లో రోగుల తాకిడి పెరిగిందన్నారు. కానీ ఇక్కడ యూనిట్స్ తక్కువ ఉన్నాయని తెలిపారు. పెట్ల బురుజు , నిలోఫర్ నుంచి కొన్ని యూనిట్స్ ను ఇక్కడకు తెప్పిస్తామన్నారు. శానిటేషన్ కోసం  ప్రతి బెడ్ మీద నెలకు రూ.5 వేలు ఇచ్చేవాళ్లం.. ఇప్పుడు దాన్ని రూ.7500కి పెంచాము.. కేవలం శానిటేషన్ కోసమే రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నామని.. అందుకే పారిశధ్యం మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నామన్నారు. 
18 ఆస్పత్రుల్లో ఉచిత భోజనం.. 3పూటలా రూ.5కే భోజనం
జంట నగరాల్లో18 హాస్పిటల్స్ లలో ఈ నెల 12న ఉచితంగా భోజనం కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్నారు మంత్రి హరీష్ రావు, అలాగే మూడు పూటలా ఐదు రూపాయల మీల్స్ పెడతామన్నారు. నిజాం కాలంలో పెట్టిన హాస్పిటల్స్ తో వైద్యం అందిస్తున్నామని.. ఇప్పుడు కేసీఆర్ హయాంలో కొత్త హాస్పిటల్స్ వస్తున్నాయన్నారు. కేసీఆర్ కిట్ లు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో  ప్రసవాలు 30 నుంచి 56శాతానికి పెరిగాయన్నారు. 
 

కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో సాయంత్రం ఓపీ
కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో సాయంత్రం ఓపీని  ప్రారంభిస్తున్నామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఈ నెల 11వ తేదీన 10రేడియాలజి ల్యాబులను మంత్రులు ప్రారంభిస్తారని తెలిపారు. మరో 2 రాబోతున్నాయి.. మొత్తం 12 సెంటర్స్ ప్రారంభిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవాల మార్పిడి ఉచితంగా జరుగుతున్నాయని, అలాగే నార్మల్ డెలివరీలకు ఇంటెన్సివ్ లు ప్లాన్ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 39 శాతం మాత్రమే గోల్డెన్ హవర్లో తల్లి పాలు అందుతున్న పరిస్థితి ఉందని తెలిపారు. వైద్యులు ఎక్కడైనా అవసరం లేకున్నా టెస్టులు, సర్జరీలు చేస్తే... మెడికల్ కౌన్సిల్ కు రిఫర్ చెయ్యడానికి వెనకాడబోనని మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. ఇలాంటి వైద్యులపై చర్యలు ఉంటాయని.. మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. 

 

 

ఇవి కూడా చదవండి

చైనా ఆసియా గేమ్స్ వాయిదా

అట్టహాసంగా ఏఆర్‌ రెహమాన్‌ పెద్ద కూతురు పెళ్లి

కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యండిల్ ను బ్లాక్ చేసిన కేటీఆర్