- టీజీఎఫ్డీసీ చైర్మన్ పొదెం వీరయ్య
కాగజ్ నగర్, వెలుగు: తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీఎఫ్ డీసీ) పురోగతి కోసం మెరుగైన ప్రణాళికలతో పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజనగర్లోని బస్టాండ్ ఎదురుగా రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థకు చెందిన స్థలంలో కొత్తగా నిర్మించిన డివిజన్ కార్యాలయ భవన సముదాయాన్ని శనివారం ఎమ్మెల్యే హరీశ్ బాబుతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ.. టీజీఎఫ్డీసీ లాభాల బాటలో పయనిస్తోందన్నారు. కాగజ్ నగర్ డివిజన్ పరిసర అటవీ ప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్ధికి సంస్థ ద్వారా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంస్థలో ప్రస్తుతం సిబ్బంది కొరత ఉందని, ఖాళీల భర్తీ కోసం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు.
కార్యక్ర మంలో టీజీ ఎఫ్డీసీ చీఫ్ జనరల్ మేనేజర్ డి.వెంకటేశ్వర్ రెడ్డి, జనరల్ మేనేజర్ డాక్టర్ జి.స్కైలాబ్, డివిజనల్ మేనేజర్ శ్రీశ్రావణి, ఎస్పీఎం డీజీఎం నర్కడే, ప్లాంటేషన్ మేనేజర్లు ఇ.లక్ష్మణ్, జి.సురేశ్ కుమార్, వి.సునీత తదితరులు పాల్గొన్నారు.