స్టోరీ, స్క్రీన్‌‌‌‌ప్లే నేనే రాశాను..ఎంత ఊహించుకున్న అంతకు మించి ఉంటుంది: హీరో అర్జున్

స్టోరీ, స్క్రీన్‌‌‌‌ప్లే నేనే రాశాను..ఎంత ఊహించుకున్న అంతకు మించి ఉంటుంది: హీరో అర్జున్

అర్జున్ మేనల్లుడు ధృవ స‌‌‌‌ర్జా హీరోగా ఏపీ అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘మార్టిన్’. వైభవి శాండిల్య  హీరోయిన్. ఉద‌‌‌‌య్ కె మెహ‌‌‌‌తా నిర్మించారు. అక్టోబర్ 11న పాన్ ఇండియావైడ్‌‌‌‌గా విడుదలవుతోంది.

ఎంఎస్ ఫిల్మ్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై మురళీ పాకాల తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు.ఈ నేపథ్యంలో శుక్రవారం (అక్టోబర్ 4) హైదరాబాద్‌‌‌‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. దర్శకుడు బి గోపాల్ ముఖ్యఅతిథిగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.

ALSO READ | RGV: 35 ఏళ్ల ట్రెండ్ సెట్టర్ ఫిల్మ్ శివ.. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ ట్వీట్

అర్జున్ మాట్లాడుతూ ‘ఈ మూవీ కోసం చాలా ఎక్సయిటింగ్‌‌‌‌గా ఉన్నాం. టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి నేను స్టోరీ, స్క్రీన్‌‌‌‌ప్లే అందించా. ధృవ చాలా హార్డ్ వర్కర్. క్యారెక్టర్ కోసం ఎంతదూరమైనా వెళ్తాడు. ప్రేక్షకుడు ఎంత ఊహించుకుని వచ్చినా.. దాని కంటే ఎక్కువగా ఉంటుంది. ఒక మంచి కమర్షియల్ సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది’ అని చెప్పారు.

ధృవ సర్జా మాట్లాడుతూ ‘రెండున్నరేళ్లుగా ఈ సినిమా కోసం వర్క్ చేశాం.  సినిమా నచ్చితే నన్ను ఎంకరేజ్ చేయండి. బాగోలేదంటే నెక్స్ట్ మూవీకి నన్ను ఎంకరేజ్ చేయొద్దు. ఈ సినిమా కోసం నా బెస్ట్ ఇచ్చా’ అని చెప్పాడు. హీరోయిన్ వైభవి మాట్లాడుతూ ‘ధృవ సర్జాతో నటించడం హ్యాపీ. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పింది. సపోర్ట్ చేసిన టీమ్‌‌‌‌కు  నిర్మాత ఉదయ్ కె మెహతా థ్యాంక్స్ చెప్పారు.