అవినాష్ కాలేజీ మీద చర్యలు తీసుకోవాలి

అవినాష్ కాలేజీ మీద చర్యలు తీసుకోవాలి
  • ఏబీవీపీ నాయకుల ఆందోళన

పద్మారావునగర్, వెలుగు:  సికింద్రాబాద్ అవి నాష్ కాలేజీ అరాచకాలు  రోజు రోజుకు పెరు గుతున్నాయని, కాలేజీపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని  ఏబీవీపీ   సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ బాలు డిమాండ్ చేశారు.  విద్యార్థులు గొడవపడ్డ కారణంగా డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న రాహుల్ అనే దళిత విద్యార్థిని బహిష్కరించి, రోడ్డుపైకి నెట్టడాన్ని, విద్యార్థిపై బూటకపు కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ గురువారం అవినాష్ కాలేజీ ప్రధాన గేట్ ముందు ఏబీవీపీ నాయకులు బైఠాయించి ధర్నా చేపట్టారు.

కాలేజీ నుంచి బహిష్కరింపబడిన దళిత విద్యార్థికి న్యాయం చేసి, అవినాష్ కళాశాల అనుమతులను రద్దు చేయాలని అన్నారు. బౌన్స ర్లతో కళాశాలను నడిపించడం ఇదెక్కడి సంస్కృతి అన్నారు.   ఆందోళన చేస్తున్న  నేతలను అరెస్ట్​ చేసి, పోలీస్​ స్టేషన్​ కు   తీసుకువెళ్ళారు.