మరికల్, వెలుగు : మండలంలోని చిత్తనూర్ వద్ద ఏర్పాటు అయిన ఇథనాల్ కంపెనీ అనుమతులు రద్దు చేయాలని శనివారం తహసీల్దార్ సునీతకు చిత్తనూర్ ఇథనాల్ కంపెనీ వ్యతిరేక కమిటీ సభ్యులు వినతి పత్రం ఇచ్చారు.
ఇథనాల్ కంపెనీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రూల్స్‌ను ఉల్లంఘించిందన్నారు. కలెక్టర్ దీనిపై స్పందించాలన్నారు. లేకుంటే ఆందోళనలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు వెంకట్రాములు, కో కన్వీనర్ ఎం.సుదర్శన్, వెంకటేష్‌తో పాటు పలువురు ఉన్నారు.