పద్మారావునగర్/ఓయూ, వెలుగు : ముదిరాజ్ కులా న్ని దుర్భాషలాడిన ఎమ్మెల్సీ పాడే కౌశిక్ రెడ్డిపై 24 గంటల్లో కేసీఆర్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముదిరాజ్ సంఘం డిమాండ్ చేసింది. ఆయన్ను వెంటనే ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని..లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజుల తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించింది. బాధ్యతగల పదవిలో ఉన్న కౌశిక్ రెడ్డి.. ఓ జర్నలిస్టుపై దాడి చేయడమే కాకుండా ముదిరాజ్ కులాన్ని దుర్భాషలాడారని ఆరోపించింది.
ALSOREAD:చెరువుల పండుగ’ పైసలేవి..
సోమవారం పార్సిగుట్ట చౌరస్తాలో రాష్ట్ర ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కనకయ్య ఆధ్వర్యంలో అన్ని పార్టీలకు చెందిన ముది రాజ్ నేతలు కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వారాసిగూడ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్సీపై ఫిర్యాదు చేశారు.