- మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత రవీంద్రనాయక్
హైదరాబాద్, వెలుగు : మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులు చేసిన అవినీతి, కుంభకోణాలపై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత రవీంద్ర నాయక్ ఒక ప్రకటనలో కోరారు. పదేండ్లలో రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని, తెలంగాణ రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని ఫైర్ అయ్యారు.
ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు గుండు సున్నా ఇచ్చినప్పటికీ కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుకు బుద్ధి రాలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ కేసీఆర్ అవినీతి, కుంభకోణాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.