
గండిపేట, వెలుగు: అసెంబ్లీ స్పీకర్‌గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బి.జ్ఞానేశ్వర్‌ముదిరాజ్, గండిపేట మండల అధ్యక్షుడు అశోక్‌యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం మంచిరేవుల చౌరస్తాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జగదీశ్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
స్పీకర్‌ను ఏకవచనంతో మాట్లాడడం కరెక్ట్‌కాదన్నారు. బీఆర్ఎస్ఇచ్చిన హామీ ప్రకారం దళితుడిని సీఎం చేయకపోగా, చాన్స్దొరికినప్పుడల్లా దళితులను కించపపరుస్తోందని మండిపడ్డారు.