
వనపర్తి టౌన్, వెలుగు: వనపర్తి పట్టణంలోని పీర్లగుట్టలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్ డీఎం లా కాలేజీ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు గజరాజుల తిరుమలేశ్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని లా కాలేజీ ఎదుట లా స్టూడెంట్లతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి అనుమతులు లేకుండానే లా కాలేజీ నడుస్తోందన్నారు. ఇప్పటికైనా పాలమూరు యూనివర్శిటీ అధికారులు స్పందించి అక్రమ ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో లా కాలేజ్ స్టూడెంట్లు కళ్యాణ్, గోపాలకృష్ణ,శరత్ గౌడ్, తదితర విద్యార్థులు పాల్గొన్నారు.