
సంగారెడ్డి టౌన్, వెలుగు : బస్వాపూర్ ఆదర్శ మోడల్ స్కూల్ విద్యార్థులకు క్రైస్తవ మత బోధనలు చేస్తున్న ప్రిన్సిపాల్ జ్యోతి హెప్సీబాను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం డీఈవో వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకట్రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 19న స్కూల్లో కొందరు బయట వ్యక్తులను తీసుకొచ్చి మత బోధన చేయించారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. ఏబీవీపీ నాయకులు తానాజీ, నిఖిల్, పాండు,వెంకట్ పాల్గొన్నారు.