చెరువును కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

చెరువును కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

జన్నారం, వెలుగు: జన్నారం మండలం కిష్టాపూర్ లోని ఊర చెరువును కబ్జా చేశారని, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం చెర్లపల్లి గ్రామానికి చెందిన మత్స్యకారులు చెరువులో టెంట్ వేసి ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్ డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ రాజు సర్వేయర్​తో కలిసి వారి వద్దకు వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. 

అక్కడ పోసిన మట్టిని సోమవారం తొలగించి చెరువును సర్వే చేస్తామని వారికి చెప్పినా పట్టువీడలేదు. చెరువులో పోసిన మట్టిని వెంటనే తొలగించి అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని మత్స్యకారుల సంఘం ప్రెసిడెంట్ తోకల నర్సయ్య,ఉపాధ్యక్షుడు ధర్నాజీ సత్తయ్య డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో మత్స్యకారుల కుటుంబాలు సైతం పాల్గొన్నాయి.