
లింగాల, వెలుగు: మండలంలోని అప్పాయిపల్లి గ్రామ చెంచు కాలనీలో ఐటీడీఏ ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ధ్వంసం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బీజేపీ మండల అద్యక్షుడు సలేశ్వరం డిమాండ్ చేశారు. రెండేండ్ల కింద ఐటీడీఏ ఆధ్వర్యంలో చెంచు గిరిజనుల కోసం మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. ఈ వాటర్ ప్లాంట్ ను కాలనీకి చెందిన నిమ్మల సలేశ్వరం రెండు రోజులు కింద తన ట్రాక్టర్ డోజర్ తో ధ్వంసం చేశాడని తెలిపారు. దీంతో గిరిజనులు నీటి కోసం ఇబ్బంది పడుతున్నారన్నారు. యాదగిరి సలేశ్వరం, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సురేందర్రావు, నిరంజన్ ఉన్నారు.