
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని జీటీ నారాయణ గురుకుల నవోదయ కోచింగ్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం మహబూబ్ నగర్ డీఎస్పీ మహేశ్కు వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి జిల్లా విద్యార్ధుల జీవితాలతో కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఆడుకుంటున్నారని ఆరోపించారు. కొత్తకోటలోని జీటీ నారాయణ స్కూల్, ఎల్జీ కాన్సెప్ట్ స్కూల్ యాజమాన్యంపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. రాము, సంతోష్ రాథోడ్, భరత్, వెంకట్, రవి, ఛత్రపతి నాయక్, మోహన్ నాయక్, మహేశ్ ఉన్నారు.