
- జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారిణి జె. జయంతి
భీమదేవరపల్లి,వెలుగు: అంగన్వాడీలు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా స్ర్తీ ,శిశు సంక్షేమ అధికారిణి జె. జయంతి అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తాఫాపూర్ గ్రామంలో ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల ఐసీడీఎస్ పోషణ పక్షం కార్యక్రమం జరిగింది. సీడీపీవో స్వరూప అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీడబ్ల్యువో మాట్లాడుతూ.. గర్బవతి మొదలు శిశువు ప్రాథమిక విధ్యాభ్యాసం ప్రారంభించే వరకు పూర్తి భాధ్యత అంగన్వాడీదేనన్నారు.
ఈ సందర్భంగా వివిధ కేంద్రాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో పోషణ్‌అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ టి. సుమలత, డీసీపీవో ప్రవీణ్‌కుమార్, మెడికల్ ఆఫీసర్లు మోనిక, నివేదిత, సూపర్వైజర్లు అనిత, శిరీష, సుశీల ఇతర సిబ్బంది పాల్గొన్నారు.