బెల్ట్ షాప్ లకు మద్యం అమ్మితే వైన్స్ షాప్ లపై చర్యలు : ఎస్.సైదులు

  • ఎక్సైజ్ సూపరిండెంట్ ఎస్.సైదులు 

 చౌటుప్పల్ వెలుగు : వైన్ షాప్ యజమానులు బెల్ట్ షాప్ లకు మద్యం అమ్మితే చర్యలు తీసుకుంటామని యాదాద్రి భువనగిరి జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ ఎస్. సైదులు హెచ్చరించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనలతో గురువారం చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో చౌటుప్పల్ ఏసీపీ కార్యాలయంలో స్థానిక పోలీసులు,ఎక్సైజ్ శాఖ కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సూపరిండెంట్ మాట్లాడుతూ.. అక్రమ బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించి, చర్యలు తీసుకుంటామని తెలిపారు.

చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలో ఎక్కడ బెల్ట్ షాపులు నిర్వహించినా తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ సమావేశంలో చౌటుప్పల్ సీఐ అశోక్ రెడ్డి, రామన్నపేట ఎక్సైస్ సీఐ బాలాజీ నాయక్, డీటీఎఫ్​ యాదాద్రి భువనగిరి ఎక్సైజ్ సీఐ రాధా కిషన్, రామన్నపేట ఎక్సైజ్ ఎస్సై శంకర్, సంస్థాన్ నారాయణపురం ఎస్ఐ జగన్  పాల్గొన్నారు.