హైదరాబాద్,వెలుగు: వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి యూజీసీ గుర్తింపు కోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేయాలని తెలంగాణ మహిళా విద్యావంతుల ఫోరం (టీఎంవీఎఫ్) స్టేట్ ప్రెసిడెంట్ స్వర్ణలత, జనరల్ సెక్రటరీ తల్లమల్ల శ్వేత హసేన్ ప్రభుత్వాన్ని కోరారు.
ఈ మేరకు ఆదివారం వారు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. నాలుగేండ్ల క్రితం మహిళా వర్సిటీని ఏర్పాటు చేసినా.. ఇప్పటివరకూ అసెంబ్లీలో చట్టం చేయకపోవడం దారుణమని తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన స్కిల్ వర్సిటీకి అసెంబ్లీలో చట్టం చేసి పర్మినెంట్ వీసీని నియమించారని గుర్తుచేశారు.