
శివ్వంపేట, వెలుగు : ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శివ్వంపేట తహసీల్దార్ శ్రీనివాస్ చారి హెచ్చరించారు. మండల పరిధిలోని గుండ్లపల్లి గ్రామ శివారులో ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 19లో కలెక్టర్ ఆదేశాల మేరకు జర్నలిస్ట్‌లకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు.
సదరు భూమి చుట్టూ కడీలు వేసి బౌండరీ ఫిక్స్ చేయగా దొంతి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కడీలను తొలగించారు. ఈ విషయంపై జర్నలిస్టులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయగా.. గురువారం ఆ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కడీలు తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్సై రవికాంతరావుకు ఫిర్యాదు చేశారు.