కల్లాల్లోనే కాంటా.. వడ్ల కొనుగోలులో దళారుల జోరు

  • వాతావరణ మార్పులతో మద్దతు ధరపై ఎఫెక్ట్
  • వారం రోజుల్లో రూ.50 కోట్ల చేతివాటం

నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో వడ్ల కొనుగోలులో దళారుల జోరు కనిపిస్తోంది. ఓ వైపు ఆఫీసర్లు పది శాతం సెంటర్లు కూడా ఏర్పాటు చేయకపోవడం.. మరో వైపు అకాల వర్షాలు కురుస్తుండడం  రైతులు వ్యాపారులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అదునుగా రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు.

12 లక్షల మెట్రిక్ టన్నుల టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

ఖరీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 7 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. మొత్తం12 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల దిగుబడి వస్తుందని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు. ప్రభుత్వ ఐకేపీ, మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 458, కామారెడ్డి జిల్లాలో 336 సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏ గ్రేడ్ ధాన్యం రకానికి రూ.2,060 , బి గ్రేడ్ ధాన్యానికి రూ.2,040  ధర ఇస్తున్నారు.  

సెంటర్ల ఏర్పాటులో జాప్యం..

నిజామాబాద్ జిల్లాలో 30 రోజుల కింద వరి కోతలు ప్రారంభమైనా ఆఫీసర్లు కొనుగులు సెంటర్ల ఏర్పాటులో జాప్యం చేశారు. ఈ నెల 21 నుంచి కొనుగోళ్లు ప్రారంభించారు. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 458 సెంటర్లలో కొనుగోళ్లు జరగాల్సి ఉండగా 45 సెంటర్లలోనే వడ్లు కొంటున్నారు. కామారెడ్డి జిల్లాలో 336 సెంటర్లకు ఇప్పటికీ 30 మాత్రమే షురూ చేశారు. వారం రోజుల కింద జిల్లాలో అకాల వర్షాలతో వడ్లు పూర్తిగా తడిసిపోయాయి. తేమ శాతం ఎక్కువగా ఉండడంతో వడ్లు పూర్తిగా ఎండిన తరువాతనే కొనుగోళ్ల సెంటర్లకు తీసుకరావాలని ఆఫీసర్లు సూచిస్తున్నారు. కొనుగోళ్లు ఆలస్యం అవుతుండడంతో దళారులు నేరుగా కల్లాల్లోకి దిగుతున్నారు. తడిసిన ధాన్యానికి 5 కిలోల వరకు కడ్తా తీస్తే క్వింటాలు రూ.106 ధర తగ్గుతుంది. ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూలీ ధరతో కలుపుకుని రైతుకు క్వింటాలుకు రూ.300 నష్టం వస్తోంది. ఈ లెక్కన ప్రతి రైతుకు రూ.30 వేల నుంచి లక్ష దాకా నష్టం జరుగుతుంది. ఇప్పటి వరకు 2 లక్షల క్వింటాళ్ల వడ్లను దళారులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే రూ. 50 కోట్లు దళారుల జేబుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సెంటర్లలో కొనుగోళ్లు స్పీడప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని రైతులు కోరుతున్నారు. 

మా వద్ద కోతలు మొదలై పది రోజులు దాటింది. కానీ ఇంకా కొనుగోలు సెంటర్లు తెరవలేదు. వడ్లను రోడ్లపై ఆరబోసుకుని కావలి కాస్తున్నాం. అకాల వర్షాలతో మొన్న వడ్లు తడిసిపోయాయి. తడిసిన వడ్లకు కడ్తా పేరిట కోత విధిస్తే క్వింటాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.500 వరకు నష్టపోతాం.  - రాజు, రైతు నల్లవెల్లి

రైతులను మోసగిస్తే చర్యలు
జిల్లాలోని కొనుగోలు సెంటర్ల ఏర్పాటు స్పీడ్ చేయాలి. కడ్తా పేరుతో కోతలు విధిస్తే రైతులు ఆఫీసర్ల దృష్టికి తీసుకురండి. ఎక్కడ అమ్మినా మద్దతు ధరకే అమ్మాలి. దళారులు ఒత్తిడి తెస్తే ఫిర్యాదు చేయండి. సేకరించిన ధాన్యాన్ని వెంటనే  కేటాయించిన మిల్లులకు తరలించాలి.  -సి.నారాయణరెడ్డి, కలెక్టర్, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌​