కాంగ్రెస్ మేనిఫెస్టోను అవమానించిన హెడ్ కానిస్టేబుల్ పై చర్యలు

సూర్యాపేట, వెలుగు: కాంగ్రెస్‌‌ మేనిఫెస్టోని అవమానించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన నూతనకల్‌‌ హెడ్ కానిస్టేబుల్ దాచేపల్లి అరవింద్‌‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.  

శనివారం ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  పెన్ పహాడ్ మండలం లింగాల గ్రామానికి చెందిన దాచేపల్లి అరవింద్  గ్రామానికి సంబంధించిన  వాట్సప్ గ్రూప్‌‌లో కాంగ్రెస్  ఎన్నికల మేనిఫెస్టో ను అవమానించేలా పోస్టులు పెట్టారు. ఈ విషయంపై పలువురు గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో  శాఖా పరమైన చర్యల కింద జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు.